స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -592 లో....కావ్య తనపై అంత పెద్ద బాధ్యతలు పెట్టినందుకు బాధపడుతూ దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది. అప్పుడే ఇందిరాదేవి వచ్చి.. సమస్యలని పక్కన పెట్టి బాధ్యతలు తీసుకోమని ఇందిరాదేవి అంటుంది. చాలా హ్యాపీగా ఉంది నాన్న ఇలా చేసినందుకని సుభాష్ అంటాడు.
ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉందటున్నారు కానీ ధాన్యలక్ష్మి, అత్తయ్య, రుద్రాణి గార్లని ఎదరుకోగలనా అని కావ్య అంటుంది. దైర్యంగా ఎదుర్కో మేమ్ మీకు సపోర్ట్ అంటూ ఆస్తుల పేపర్స్, తాళాలు కావ్య చేతిలో పెడతారు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వచ్చి ఆస్తుల పేపర్స్ ఇచ్చి దీనికి మీరే అర్హులని అంటుంది. లేదు తాతయ్య నీకేం ఇచ్చాడని రాజ్ అంటాడు. తాతయ్యకి నీకు ఆ సామర్థ్యం ఉందని నమ్మాడు. ఆ నమ్మకం నిలబెట్టుకోమని రాజ్ పాజిటివ్ గా మాట్లాడేసరికి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రుద్రాణి, రాహుల్ కలిసి.. అసలు ఇలా జరిగిందేంటని బాధపడుతుంటారు. అప్పుడే స్వప్న వచ్చి సిచువేషన్ తగ్గ సాంగ్ పెడుతుంది. దాంతో రాహుల్, రుద్రాణీలకి ఇంకా కోపం వస్తుంది.
ఆ తర్వాత ధాన్యలక్ష్మి ఆస్తుల గురించి లాయర్ తో కోర్ట్ లో వేయమని చేప్తుంది. అప్పుడే ప్రకాష్ వచ్చి కావ్యపై కేసు వెయ్యడానికి సిద్ధమయ్యావన్నమాట అని అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రకాష్ విరుచుకుపడతాడు.ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వస్తుంది. దాంతో ధాన్యలక్ష్మి, రుద్రాణి లు కనకాన్ని సూటిపోటీ మాటలతో బాధపెడతారు. తరువాయి భాగం లో రాజ్ దగ్గరికి కొంతమంది వచ్చి.. మీ తాతయ్య గారు తన ఫ్రెండ్ ని నమ్మి కోటి రూపాయలకి షూరిటీ సంతకం పెట్టారు. అది ఇప్పుడు మీ తాతయ్య కట్టాలి. లేదంటే ఆస్తులు తీసుకుంటామని వాళ్ళనగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.